News July 22, 2024

పవన్‌కళ్యాణ్‌కు సెక్యూరిటీ పెంచాలి: వర్మ

image

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సెక్యూరిటీ పెంచాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ కోరారు. పిఠాపురంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర నిఘా సంస్థలు సైతం పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందని సమాచారం ఇచ్చాయన్నారు. ఈ మేరకు ఆయన భద్రతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

Similar News

News November 18, 2025

రాజమండ్రి: ఒకేసారి రెండు పథకాల డబ్బులు..!

image

తూర్పు గోదావరి జిల్లాలో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 1,14,991 మంది లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు డీఏఓ ఎస్.మాధవరావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నదాత సుఖీభవ కింద రూ. 57.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 5000), పీఎం కిసాన్ కింద రూ. 19.50 కోట్లు (ఒక్కో రైతుకు రూ. 2000) మంజూరయ్యాయి. మొత్తం రూ. 77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

రాజమండ్రి: ‘ప్రశాంతంగా 10 పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలి’

image

రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను విద్యార్థులు ప్రశాంతంగా రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఫర్ ఎగ్జామినేషన్స్ ఎం. అమల కుమారి అధికారులకు సూచించారు. సోమవారం ఆమె రాజమండ్రిలోని కంటిపూడి రామారావు మున్సిపల్ స్కూల్‌లోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర సదుపాయాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.