News June 5, 2024

పవన్‌ను కలిసిన ఉమ్మడి ప.గో. జనసేన MLAలు

image

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.

Similar News

News December 10, 2024

ప.గో: నిధుల దుర్వినియోగం.. క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశం

image

యలమంచిలి మండలం చించినాడ పంచాయతీలో పనిచేస్తున్న సెక్రటరీ జయరాజు రూ.14,94,224, ముత్యాలపల్లి సెక్రటరీ కృష్ణంరాజు రూ.1,99,50,956, చినఅమిరం పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ సుమనాగ్ రూ.15,98,455 ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని కలెక్టర్ నాగరాణి సోమవారం తెలిపారు. వీరిపై క్రిమినల్ చర్యల నిమిత్తం భీమవరం తాహశీల్దార్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. నిధులు మళ్లింపుకు సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు.

News December 9, 2024

అధికారులను అలర్ట్ చేశాం: కలెక్టర్

image

ఏలూరు జిల్లా రైతులు తమ సమస్యలను నెం.18004256453, 08812-230448, 7702003584 ఫోన్ చేసి తెలపాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 48 గంటల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులను అలర్ట్ చేశామన్నారు. రైతుల సమస్యలను దగ్గరలోని అధికారులకు తెలపాలన్నారు.

News December 9, 2024

గోపాలపురంలో రోడ్డు ప్రమాదం.. తల్లీకూతుళ్లు మృతి

image

గోపాలపురం మండలం దొండపూడిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. బైక్‌పై వెళ్తున్న తల్లీకుమార్తెలు ట్రాక్టర్‌ను తప్పించే క్రమంలో మరో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రగాయలైన వారిని స్థానికులు వైద్యం కోసం రాజమండ్రి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతులు పోలవరం(M) బండార్లగూడెంకు చెందిన కాంతమ్మ(45), గన్నమ్మ(75)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.