News March 20, 2024

పవన్‌ను నేను కలవలేదు: పిఠాపురం వర్మ

image

పవన్ కళ్యాణ్‌ను ఇటీవల తాను కలిసినట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని వర్మ పేర్కొన్నారు. ‘పవన్‌తో నేను రెండు మూడు సార్లు ఫొటో దిగాను. 2014లో పవన్‌ను కలిసిన ఫొటోను అప్పుడప్పుడు జనసేన నేతలు వాడుతున్నారు. గతంలో పవన్‌ను కలిసినప్పుడు విజయానికి సీక్రెట్ ఏంటని నన్ను అడిగారు. ఎప్పుడూ కష్టపడుతూ ఉంటానని చెప్పా. అప్పుడు పవనే పిలిచి ఫొటో తీసుకుందామని అడిగారు’ అని ఆయన జ్ఞాపకాలను వర్మ గుర్తు చేసుకున్నారు.

Similar News

News April 5, 2025

తూ.గో: జిల్లాలో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం

image

రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలు శనివారం రాజమండ్రిలో ప్రారంభమయ్యాయి. అండర్-15,అండర్ -20 బాలుర బాలికల విభాగంలో నిర్వహిస్తున్న ఈ కుస్తీ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి 350 మంది రెజ్లర్స్ హాజరయ్యారు. ఈ పోటీలను శనివారం జిల్లా ఎస్పీ డీ నరసింహ కిషోర్ ప్రారంభించారు.

News April 5, 2025

తూ.గో: జిల్లాలో వాతావరణం శాఖ హెచ్చరికలు

image

తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శని, ఆదివారం పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు చెట్లు, కరెంట్ పోల్స్, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.

News April 5, 2025

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధి మృతి

image

గండేపల్లి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి బాడవుల కేదార్ మణికంఠ (21) చికిత్స పొందుతూ మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం..ఏలూరు ముదినేపల్లికి చెందిన మణికంఠ, రాజమండ్రికి చెందిన విష్ణువర్ధన్‌తో కలిసి ధర్మవరంలో బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా బైకు ఢీకొట్టిన ఘటనలో చనిపోయాడన్నారు.

error: Content is protected !!