News February 8, 2025
పవన్‌పై అభిమానం.. విజయవాడకు పయనం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో చిత్తూరు యువకుడు సాహసానికి శ్రీకారం చుట్టాడు. శాంతిపురం మండలం కోలాల తిమ్మనపల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు బాలకృష్ణ పుట్టుకతో దివ్యాంగుడు. పవన్‌కు అతను వీరాభిమాని. ఎలాగైనా అతడిని కలవాలన్న ఉద్దేశంతో మూడు చక్రాల సైకిల్‌పైనే విజయవాడకు పయనమయ్యాడు.
Similar News
News November 26, 2025
చిత్తూరు: టెన్త్ హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్

టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్‌పై పరీక్షా కేంద్రాన్ని తెలిపే క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు కేంద్రాలను గుర్తించడం సులభతరం కానుంది. చిత్తూరు జిల్లాలోని 535 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 22 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.
News November 26, 2025
3 ముక్కలుగా పుంగనూరు..!

మదనపల్లె జిల్లాలోకి పుంగనూరును మార్చనున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 6మండలాలను 3రెవెన్యూ డివిజన్ల పరిధిలోకి చేర్చనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మండలాలు మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. సోమల, సదుం కొత్త డివిజన్ పీలేరులో కలుస్తాయి. పులిచెర్ల, రొంపిచర్ల మండలాలను చిత్తూరు డివిజన్‌లోనే కొనసాగించనున్నారు. ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటారు.
News November 26, 2025
చిత్తూరు జిల్లా విభజన.. వాళ్లకు నిరాశే!

చిత్తూరు జిల్లా విస్తీర్ణం తగ్గిపోనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని 6మండలాలను మదనపల్లె జిల్లాలో కలపనున్నారు. పుంగనూరు, చౌడేపల్లె మదనపల్లె డివిజన్‌లోకి వెళ్తాయి. సదుం, సోమల, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు పీలేరు డివిజన్‌లో చేర్చుతారు. పలమనేరు డివిజన్‌లో ఉన్న బంగారుపాళ్యాన్ని చిత్తూరులోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురం, కార్వేటినగరం, వెదురుకుప్పాన్ని తిరుపతిలో కలపాలనే డిమాండ్‌ను పట్టించుకోలేదు.


