News February 8, 2025

పవన్‌పై అభిమానం.. విజయవాడకు పయనం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో చిత్తూరు యువకుడు సాహసానికి శ్రీకారం చుట్టాడు. శాంతిపురం మండలం కోలాల తిమ్మనపల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు బాలకృష్ణ పుట్టుకతో దివ్యాంగుడు. పవన్‌కు అతను వీరాభిమాని. ఎలాగైనా అతడిని కలవాలన్న ఉద్దేశంతో మూడు చక్రాల సైకిల్‌పైనే విజయవాడకు పయనమయ్యాడు. 

Similar News

News March 25, 2025

చిత్తూరు: మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఇందుకోసం మార్చి 10 నుంచి దరఖాస్తులను బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.

News March 24, 2025

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు: SP 

image

ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి ఎవరైనా బెట్టింగ్ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ చందోలు హెచ్చరించారు. అధిక మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తే డయల్ 112కు గాని, వాట్సాప్ నెంబర్ 9440900005కు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

News March 24, 2025

PES స్నాతకోత్సవంలో మాజీ చీఫ్ జస్టిస్ రమణ

image

కుప్పం పీఈఎస్ వైద్య కళాశాలలో 17వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ హాజరైయ్యారు. పీఈఎస్ విద్యా సంస్థ అధినేత దొరస్వామి నాయుడుకు నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో వైద్య విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!