News March 20, 2024

పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలు : వంగా గీత

image

జనసేనలోకి పిఠాపురం వైసీపీ MLA అభ్యర్థి వంగా గీతను, పవన్ కళ్యాణ్ ఆహ్వానించడంపై ఆమె స్పందించారు. పవన్ కళ్యాణ్‌వి దింపుడు కళ్లెం ఆశలని ఎద్దేవా చేశారు. ‘నేను కూడా పవన్ కళ్యాణ్‌ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది’ అని మండిపడ్డారు. పిఠాపురంలో కేవలం ‘నా మెజార్టీ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయి’అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News February 15, 2025

గోకవరం: స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

image

గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన కుంచే నాగేంద్ర (5) ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతి చెందిన విద్యార్థి  కోరుకొండలో ప్రైవేట్ స్కూల్లో ఎల్‌కేజీ  చదువుతున్నాడు. ఈ సంఘటనతో వెదురుపాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 15, 2025

రాజమండ్రి: దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

image

బిక్కవోలు కేంద్రంగా దోంగ నోట్లును ముద్రిస్తున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా నుంచి 1.07 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేశామన్నారు. బిక్కవోలుకు చెందిన మెకానిక్ నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నకిలీ నోట్ల గుట్టురట్టు చేశారు.

News February 15, 2025

రాజమండ్రి: జిల్లాలో దడ పుట్టిస్తున్న ‘జీబీఎస్’

image

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

error: Content is protected !!