News March 26, 2025

‘పవన్ అన్న నువ్వు పిఠాపురం రా..!’

image

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని పిఠాపురం ప్రజలు ఎంతో ప్రేమతో గెలిపించుకున్నారు. ఆయన వచ్చాక పిఠాపురం దశ దిశ మారతాయని ఎంతో ఆత్రుతగా ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. కానీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నెగ్గిన తర్వాత పవన్ పిఠాపురానికి రావడం చాలా తక్కువే. ఏదో కార్యక్రమంలో ఇలా వచ్చి అలా వెళ్తున్నారు. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి, పవన్ అన్న నువ్వు పిఠాపురం రా అని ప్రజలు, అభిమానులు కోరుకుంటున్నారు.

Similar News

News April 3, 2025

 వేసవి సెలవులు.. మీ పిల్లలు జాగ్రత్త: మెదక్ ఎస్పీ

image

మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

News April 3, 2025

గతేడాది మహబూబ్‌నగర్ FIRST.. ఈసారి వెనుకంజ..!

image

ఆస్తి పన్ను వసూళ్లను 100% అధిగమిస్తామని మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎనిమిది బృందాలుగా ఏర్పడి.. ప్రతిరోజు ముమ్మరంగా వసూళ్లు చేపట్టారు. మార్చి నెలాఖరు నాటికి 100%వసూళ్లే టార్గెట్‌గా చేసిన ప్రయత్నాలు 47% శాతానికి పరిమితమై గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలో ఆస్తిపన్ను వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్ మున్సిపల్ శాఖ ఈసారి 50% కూడా చేయలేకపోయింది. 

News April 3, 2025

నాగర్‌కర్నూల్: సాహితికి GOVT జాబ్.. సన్మానం 

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 45వ ర్యాంకు సాధించిన ఉపాధ్యాయులు రాజ్యలత-వెంకటరమణ దంపతుల కూతురు డాక్టర్ సాహితిని PRTU TS నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం  ఘనంగా సన్మానించారు. సాహితీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

error: Content is protected !!