News February 13, 2026

పవన్ ఆదేశాలతో చిన్నారులకు ఇంటి పట్టా

image

పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చెందిన సత్య, చంటి తల్లిదండ్రులు లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ సార్ మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. వారు విన్నవించినా వీడియోతో ఇటీవల Way2Newsలో వార్త ప్రచురితమైంది. దీనికి డిప్యూటీ సీఎం స్పందించి అండగా ఉంటానని, ఇంటి పట్టాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం పిఠాపురం తహశీల్దార్ గోపాలకృష్ణ ఆ చిన్నారులకు ఇంటి పట్టాను ఇచ్చారు. వారు ఇద్దరూ ఆనందించారు.

Similar News

News March 10, 2026

ఈ ఇద్దరు MPలు జీతాలు తీసుకోవట్లే!

image

ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా చాలామంది పార్లమెంటేరియన్లు జీతాలు వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం 18వ లోక్‌సభలో మొత్తం 543 మందిలో కేవలం ఇద్దరే జీతభత్యాలు తీసుకోవట్లేదని RTI ద్వారా తెలిసింది. హరియాణా BJP MP నవీన్ జిందాల్ జీతంతో పాటు అన్ని అలవెన్సులను వదులుకోగా కాంగ్రెస్ MP అంగోమ్చా బిమోల్ అకోయిజామ్(మణిపుర్) తన వేతనాన్ని నిరాకరించారు. పదవి ప్రజాసేవకే తప్ప సంపాదనకు కాదు అని వీరు నిరూపించారు.

News March 10, 2026

పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

image

గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని నిరూపిస్తూ పాడేరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అరుదైన థైరాయిడ్ క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతమైంది. లింగపుట్టు గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతికి పాపిల్లరీ కార్సినోమా థైరాయిడ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యులు టోటల్ థైరాయిడెక్టమీతో పాటు మోడిఫైడ్ రాడికల్ నెక్ డిసెక్షన్ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

News March 10, 2026

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం నకిరేకల్‌లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా ఈ ప్రణాళికను రూపొందించామని, దీని విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.