News July 9, 2024
పవన్ ఆదేశాలు.. ‘కోరింగ’లో అరుదైన జీవిపై ఫోకస్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కాకినాడ జిల్లా తాళ్లరేవు పరిధిలోని కోరింగ ఫారెస్ట్లో ఫిషింగ్ క్యాట్స్(నీటి పిల్లులు) లెక్కింపుపై అటవీ శాఖ ఫోకస్ పెట్టింది. వాటిని సంరక్షించాలని ఈనెల 2న కాకినాడ కలెక్టరేట్లో జరిగిన కీలక శాఖల సమీక్షలో పవన్ అధికారులకు సూచించారు. 2018 నాటికే అక్కడ 118 ఫిషింగ్ క్యాట్స్ ఉన్నట్లు గుర్తించారు. తాజాగా వాటి వివరాల కోసం 100 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 23, 2025
సత్యసాయి సేవలు విశ్వవ్యాప్తం: కలెక్టర్ కీర్తి

తల్లికిచ్చిన మాట కోసం పుట్టపర్తి నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించిన మహనీయుడు సత్యసాయి అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కొనియాడారు. ఆదివారం ఆర్కాట్ తోటలోని సత్యసాయి సేవా సమాజంలో జరిగిన శత జయంతి ఉత్సవాల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రేమ, సేవా భావంతో బాబా చూపిన మార్గం నేటి సమాజానికి ఆదర్శమని, ఆయన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
News November 23, 2025
‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో ‘రైతన్న- మీకోసం వారోత్సవాలు’ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శనివారం ఆమె వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 29 వరకు రైతుల ఇళ్లను సందర్శించాలని, ఆ సమాచారాన్ని డిసెంబర్ 2 వరకు విశ్లేషించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారోత్సవాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.