News February 24, 2025
పవన్ కల్యాణ్ సమావేశంలో కాకినాడ ఎంపీ

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్వహించిన సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆదివారం కాకినాడలోని ఎంపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2025
ఉండవెల్లి: ఉరేసుకుని యువకుడి సూసైడ్

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాలు.. ఉండవెల్లి మండలం తక్కశీల గ్రామానికి చెందిన అనిల్ కుమార్ మద్యానికి బానిసై చదువు ఆపేశాడు. రోజు పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మద్యం కోసం తల్లి జయమ్మను డబ్బులు అడగగా ఆమె మందలించింది. కోపోద్రిక్తుడైన అనిల్కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News February 24, 2025
మా కుటుంబ గొడవలకు ముగింపు రావాలి: మంచు విష్ణు

తనకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టమని హీరో మంచు విష్ణు చెప్పారు. అలాంటి వాతావరణంలో పిల్లలు పెరగాలనేది తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన ఫ్యామిలీలో గొడవలకు త్వరగా ఫుల్స్టాప్ పడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. శివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే ఎన్ని జన్మలైనా తండ్రిగా మోహన్బాబే ఉండాలని కోరుకుంటానని పేర్కొన్నారు. ఇటీవల మంచు ఫ్యామిలీలో వివాదాలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
News February 24, 2025
HYD: మైనర్లపై అధికారుల నిఘా..!

మాదకద్రవ్యాలపైనే కాదు మైనర్లకు సిగరెట్ అమ్మకాలపైనా అధికారులు HYDలో నిఘా పెంచారు. దీనికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఇవి సెల్ఫోన్లతో పాటు సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీస్తుంటాయి. ఈ వీడియోల ఆధరాంగా వ్యాపారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందాలు కొనసాగుతాయిని ఆయన వెల్లడించారు.