News June 3, 2024
పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ: వర్మ
జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత, పిఠాపురం కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ ఖాయమని మాజీ MLA ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం మండలం కోలంకలో పర్యటించిన ఆయన గాజుగ్లాసులో టీ తాగి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ కూటమిదే విజయమని చెప్పాయన్నారు. అలాగే, పవన్ గెలుపు కూడా ఖాయమని చెప్పినట్లు గుర్తుచేశారు.
Similar News
News September 12, 2024
అంబాజీపేట: దారికాచి దోపిడి చేస్తున్న హిజ్రాలు.. కేసు నమోదు
దారికాచి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు హిజ్రాలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చిరంజీవి బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు చేనేత కాలనీకి చెందిన రాజేంద్రప్రసాద్ అమలాపురం నుంచి వస్తుండగా చింతాలమ్మ ఆలయం వద్ద ఇద్దరు హిజ్రాలు డబ్బుల కోసం ఆపారన్నారు. డబ్బులు లేవని చెప్పగా జేబులో నుంచి రూ.4వేలు లాక్కొని మరో వ్యక్తి సాయంతో పారిపోయారన్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.
News September 11, 2024
హెక్టార్‌కు రూ.25 వేలు ఇస్తాం: చంద్రబాబు
వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు హెక్టార్‌కు రూ. 25 వేలు చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. కాకినాడ జిల్లా రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 65 వేల ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఏలేరు రిజర్వాయర్‌కు అధికంగా వరద రావడంతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయని చెప్పారు.
News September 11, 2024
దేవరపల్లి యాక్సిడెంట్.. CM తీవ్ర దిగ్భ్రాంతి
తూ.గో. జిల్లా దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.