News October 28, 2024

పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ దర్శకుడి భేటీ

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ సినీ నటుడు పార్థీబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరి పరిధి జాతీయ రహదారి వద్ద ఉన్న పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పవన్‌కు పార్ధీబన్ ప్రత్యేక చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించుకున్నారు.

Similar News

News December 17, 2025

గుంటూరు ఎంపీ పనితీరుపై IVRS సర్వే

image

టీడీపీ MPల పనితీరుపై పార్టీ అధిష్ఠానం IVRS సర్వే చేపట్టింది. మంగళవారం గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. 08645417579 అనే నెంబర్ నుంచి సర్వే జరిగింది. ఎంపీ పనితీరు బాగుంటే 1, లేకుంటే 2, చెప్పడం ఇష్టం లేకపోతే 3 నొక్కాలని సర్వేలో కోరారు. ఎంపీలుగా గెలిచి 18 నెలలు అయిన సందర్భంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. మరి ప్రజల రెస్పాండ్ ఎలా ఉందో చూడాలి.

News December 16, 2025

గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు?

image

గుంటూరు జిల్లా TDP అధ్యక్షుడిగా పిల్లి మాణిక్యారావు పేరు అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (LIDCAP) చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

News December 16, 2025

GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

image

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.