News November 8, 2024
పవన్ కళ్యాణ్‌ను కలిసిన జనసేన వీర మహిళ రాజేశ్వరి

ఆదోని నుంచి మంగళగిరికి దాదాపు 487 కి.మీ మేర సైకిల్ యాత్ర చేసిన జనసేన వీర మహిళ రాజేశ్వరి ఎట్టకేలకు తన అభిమాన నేత, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్‌ను కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆమెను పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమెను అభినందించారు.
Similar News
News December 22, 2025
సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి: కర్నూలు కలెక్టర్

ప్రజల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ న్యూరల్ కామర్తో కలిసి పీజీఆర్ఎస్ ద్వారా వినతి పత్రాలను స్వీకరించారు. ప్రతి సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల విభాగం (పీజీఆర్ఎస్) జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News December 21, 2025
జాతీయ స్థాయి యోగా పోటీలకు జిల్లా క్రీడాకారులు

ఈనెల 27 నుంచి 30 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరగబోయే 50వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ & జూనియర్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా సంఘం ఛైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. జిల్లా ఒలింపిక్ సంఘం సీఈఓ విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు సాయి కృష్ణ మాట్లాడారు.
News December 20, 2025
10వ ఫలితాల పెంపునకు 361 పాఠశాలలకు మెంటార్లు: కలెక్టర్

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు జిల్లాలో 361 పాఠశాలలకు 361 మంది అధికారులను మెంటార్లుగా నియమించినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను పటిష్ఠంగా అమలు చేసి ఈ ఏడాది 90శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. డ్రాపౌట్ అయిన 1,559 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకురావాలన్నారు. హాజరు, రోజువారీ పరీక్షలు, జవాబు పత్రాల పరిశీలనపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలన్నారు.


