News April 6, 2024
పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు పిఠాపురంలోనే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2వ విడత పర్యటన ఖరారైంది. 7వ తేదీన అనకాపల్లి, 8వ తేదీన యలమంచిలిలో పర్యటించి అక్కడ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం 9వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. 9వ తేదీ అనంతరం షెడ్యూల్‌ను తర్వాత విడుదల చేస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 25, 2025
గోపాలపురంలో మాంసం దుకాణాలు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గోపాలపురం మండలంలో రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయాలని తహశీల్దార్ కె.అజయ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రాత్రి నుంచి ఎలాంటి జంతు వధ చేయరాదన్నారు. చేపల మార్కెట్లను మూసివేయాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News January 25, 2025
రాజానగరం: హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
రాజానగరంలోని రథేయపాలేనికి చెందిన రాంబాబుకు హత్య కేసుకు సంబంధించి జీవిత ఖైదు విధిస్తూ రాజమండ్రి 5వ అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. రాజానగరం సీఐ కథనం.. రాంబాబు 2020లో అదే గ్రామానికి చెందిన వెంకన్నను హత్య చేసి, వెంకన్న బాబును గాయపరిచాడు. ఆ ఘటనకు అప్పటి ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణల అనంతరం శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.
News January 25, 2025
రాజమండ్రి : మహిళను వేధించి హత్యాయత్నం.. జైలు
కాకినాడలోని వాకలపూడి వాసి వెంకన్న (25)కు రాజమండ్రి 8వ జిల్లా సెషన్స్ జడ్జి 9ఏళ్ల జైలు, రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా నిందితుడు ఓ మహిళను లైంగికంగా వేధించి , హత్యాయత్నం చేశాడని 2022లో అప్పటి ఎస్సై వి. మౌనిక కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.