News July 5, 2024
పవన్ కళ్యాణ్ ఎవరి వద్ద స్థలం కొన్నారో తెలుసా..?

పిఠాపురంలో భూమి కొన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా ఉప్పాడ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థలం ఎక్కడ..? ధరెంత..? ఎవరి వద్ద కొన్నారనే ఆసక్తి నెలకొంది. పిఠాపురం-గొల్లప్రోలు టోల్‌ప్లాజా పక్కన 3.52 ఎకరాల వ్యవసాయ భూమిని పవన్ కొన్నారు. దీని మార్కెట్ విలువ రూ.50,05,000. కాకినాడలోని శాంతినగర్‌కు చెందిన కోన శ్రీనందు వద్ద కొనుగోలు చేసిన ఆ భూమిలో ఇంటితో పాటు పార్టీ ఆఫీస్ నిర్మించనున్నారు.
Similar News
News December 1, 2025
2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు: కలెక్టర్

తూ.గో జిల్లాలో 2 లక్షల 10వేల 210 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం ప్రకటించారు. ఈ ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి 42,822 కూపన్లను జనరేట్ చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 11,767 మంది రైతులకు రూ.2,0246 కోట్లను చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు.
News December 1, 2025
తూ.గో: చేతబడి చేశారన్న అనుమానంతో దారుణ హత్య

కోరుకొండ (M) దోసకాయలపల్లిలో ఆనంద్ కుమార్ (30) ఆదివారం దారుణ హత్యకు గురయ్యారు. ఆనంద్ తనకు చేతబడి చేశాడని రాజ్‌కుమార్ అనుమానంతో కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఆనంద్ భార్య త్రివేణికి రాజ్ కుమార్ సమీపబంధువు. అతను కొన్నాళ్లు ఆనంద్ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో భార్య పట్ల రాజ్‌కుమార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని బయటికి పంపించారు. కక్ష పెట్టుకున్న రాజ్‌కుమార్ హత్య చేశాడని CI సత్య కిషోర్ వివరించారు.
News December 1, 2025
పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.


