News January 9, 2025

పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన రద్దు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి కర్నూలు జిల్లా పర్యటన రద్దయింది. తిరుపతి బైరాగిపట్టెడలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకున్నారు. త్వరలోనే మళ్లీ జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.

Similar News

News November 8, 2025

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

image

2018 నవంబర్ 18న భార్య లక్ష్మీ దేవిని గొంతు నులిమి చంపిన కేసులో కర్నూలు శివప్ప నగర్‌కు చెందిన ముద్దాయి శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. ముద్దాయి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్నాడు. 2007లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాసులు అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

త్వరలో రూ.8 కోట్లు విడుదల: కలెక్టర్

image

మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లి పంటకు రూ.10 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మిగిలిన రూ.8 కోట్లు త్వరలోనే జమ చేస్తామని కర్నూలు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో సాంకేతిక పరిజ్ఞానం, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలులో తేమశాతం 13-14% ఉన్నా కొనుగోలు చేయాలన్నారు.