News April 3, 2024
పవన్ కళ్యాణ్ నేటి తెనాలి పర్యటన రద్దు

నేటి సాయంత్రం తెనాలిలో జరగాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయింది. పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాల వల్ల ఎన్నికల ప్రచార పర్యటనను రద్దు చేసుకున్నట్లు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం తెనాలిలో పర్యటన కోసం పార్టీ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన విషయం విధితమే.
Similar News
News February 8, 2026
GNT: రేపు ఎస్పీ ఆఫీసులో PGRS రద్దు

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు గమనించాలని చెప్పారు.
News February 8, 2026
రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలు: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. https://Meekosam.ap.gov.inవెబ్ సైట్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని, డయల్ 1100కి ఫోన్ చేసి అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. మండలాల వారీగా రెవెన్యూ క్లీనిక్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. అక్కడ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు.
News February 7, 2026
ANU: పీజీ ఆర్ట్స్, సైన్స్, లా పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన పలు పీజీ కోర్సుల మూడో సెమిస్టర్, లా కోర్సుల పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శనివారం తెలిపారు. రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు ఈనెల 16వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.


