News May 3, 2024
పవన్ కళ్యాణ్ పొన్నూరు పర్యటనలో మార్పులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొన్నూరు పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 5న పవన్ ఉదయం 10 గంటలకు, హెలికాప్టర్లో పొన్నూరులోని సజ్జ ఫంక్షన్ హాల్ ఎదురు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం ఐలాండ్ సెంటర్లో ఆచార్య ఎన్జీరంగా విగ్రహం వద్ద 11 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 12 గంటలకు పవన్ తిరుగు పయనమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News October 23, 2025
నేడు భగినీ హస్త భోజనం.. విశిష్టత తెలుసా?

భగినీ హస్త భోజనం.. సోదరీ సోదరుల ఆప్యాయతానురాగాలకు అద్దం పట్టే సాంప్రదాయ వేడుక ఇది. దీపావళి రెండో రోజు కార్తీక మాసంలో జరుపుకునే ఎంతో విశేషమైన ఈ పండుగ నాడు అక్కాచెల్లెళ్లు సోదరులను ఇంటికి పిలిచి నుదుట బొట్టు పెట్టి హారతి ఇచ్చి భోజనం తినిపించి శుభాకాంక్షలు తెలుపుతారు. తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు. ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు.
News October 23, 2025
పీజీఆర్ఎస్ అర్జీల పట్ల మనసు పెట్టండి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తీసుకున్న అర్జీల పట్ల స్పష్టమైన విచారణ చేపట్టాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి సమస్యను హృదయ పూర్వకంగా అవగాహన చేసుకుని, వారి స్థానంలో ఆలోచించి వాస్తవ పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. నిర్దేశిత సమయంలో సమస్యలు పరిష్కారం కావాలన్నారు.
News October 22, 2025
పారిశుద్ధ్యం, నీటి విషయంలో శ్రద్ధ వహించాలి: కలెక్టర్

పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించటంతో పాటు రక్షిత తాగునీరు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ వీసీ హాల్లో బుధవారం తమీమ్ అన్సారియా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో మంచినీటి సరఫరా, వ్యర్ధాల సేకరణ, నిర్వహణ, సాలిడ్, లిక్వీడ్ వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టుల పై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు.