News January 14, 2026
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే బాగా నటిస్తున్నారు: కేతిరెడ్డి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాజకీయాల్లోనే బాగా నటిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. తమ సిద్ధాంతం ఒంటరి పోరాటమని, ఒంటరిగానే గెలుస్తామని స్పష్టం చేశారు. ధర్మవరం మున్సిపాలిటీలో సున్నపు పొడి కనిపిస్తే సత్యకుమార్ వస్తున్నారని అర్థమన్నారు. ఆయనను సత్యకుమార్ అనడం కంటే పీపీపీ మంత్రి అనడమే కరెక్ట్ అని కేతిరెడ్డి వ్యాఖ్యానించారు.
Similar News
News February 15, 2026
ప.గో: పంచ శైవక్షేత్రం పట్టిసీమ ముస్తాబు

పంచ శైవ క్షేత్రాలలో ఒకటైన పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వసిద్ధమైంది. సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులను గోదావరి నది దాటించేందుకు సురక్షితమైన పంటు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం నుంచే భక్తుల తాకిడి ప్రారంభం కావడంతో, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మౌలిక వసతులను అధికారులు సిద్ధం చేశారు.
News February 15, 2026
శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాల పేర్లు తెలుసా…!

బ్రహ్మోత్సవాలు అంటే వాహన సేవలు అని తెలుసు. కానీ శ్రీకాళహస్తిలో 9 రోజులు జరిగే వాటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని అంటారు. దానికి పేర్లు ఉన్నాయి. 1వరోజు దేవరాత్రి, 2వరోజు భూతరాత్రి, 3వ రోజు గాంధర్వ రాత్రి, 4వరోజు నాగరాత్రి, 5వరోజు శివరాత్రి, 6వరోజు బ్రహ్మ రాత్రి, 7వరోజు స్కంద రాత్రి, 8వరోజు ఆనంద రాత్రి, 9వరోజు ఋషి రాత్రి అంటారు.
News February 15, 2026
నేడు శివరాత్రి.. ఏ రంగు దుస్తులు ధరించాలంటే?

మహా శివరాత్రి రోజున డార్క్ రంగు దుస్తులు ధరించకపోవడం ఉత్తమం అంటున్నారు పండితులు. నలుపు, నీలి రంగు దుస్తులు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు. ఈ రంగులు ప్రతికూల ప్రభావం చూపుతాయట. అలాగే వీటితో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో తెలుపు/పసుపు రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఇలా పూజ చేస్తే శివానుగ్రహం కలిగి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు.


