News December 16, 2024
పవన్ కళ్యాణ్ రేపటి విజయనగరం జిల్లా పర్యటన రద్దు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కురుపాం నియోజకవర్గ 17వ తేదీ పర్యటన రద్దయినట్లు ఎమ్మెల్యే జగదీశ్వరి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కురుపాం మండలంలోని గ్రామాల్లో మంగళవారం పర్యటించడానికి డిప్యూటీ సీఎం షెడ్యూల్ ఖరారు అయినప్పటికీ రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్న నేపథ్యంలో పర్యటనను రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారని కూటమి నాయకులు, అధికారులు గ్రహించాలన్నారు.
Similar News
News November 21, 2025
కొత్తవలస MRO అప్పలరాజు సస్పెండ్

కొత్తవలస MRO పి.అప్పలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవలస మండలంలోని చిన్నపాలెం, కింతలపాలెం, కొత్తవలస గ్రామాల్లో భూములకు సంబందించి మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ PGRS ద్వారా కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ డిప్యూటీ తహశీల్దార్‌గా ఉన్న సునీతకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
News November 21, 2025
ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి సమీక్ష

రాష్ట్రంలో MSME రంగ అభివృద్ధి, క్షేత్ర స్థాయి అధికారుల పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. MSMEలకు అందిస్తున్న ప్రోత్సాహం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చేపడుతున్న చర్యలపై చర్చించినట్లు మంత్రి తెలిపారు.
News November 20, 2025
VZM: ‘ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు’

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి తవిటి నాయుడు అన్నారు. విజయనగరంలోని RIO కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఫిబ్రవరి 23 – మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు 66 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నమన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


