News March 14, 2025
పవన్ కళ్యాణ్ స్పీచ్పై సర్వత్రా ఆసక్తి

పిఠాపురంలోని చిత్రాడ వద్ద మరికాసేపట్లో మొదలుకానున్న ‘జనసేన జయకేతనం’కు ఉపముఖ్యమంత్రి హాజరుకానున్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News November 2, 2025
GWL: ఇసుక క్వారీలపై నివేదిక సిద్ధం చేయాలి: కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న తరహా ఖనిజాలు, ఇసుక క్వారీలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీటిపారుదల, భూగర్భ జల, గనులు మరియు భూగర్భ శాఖ, టీఎస్ఎండీసీ, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులు ఈ నివేదికలను సిద్ధం చేసి, ఆయా శాఖల కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.
News November 2, 2025
ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.
News November 2, 2025
గోరంట్ల బ్రిడ్జిపై తేలిన ఇనుప కడ్డీలు

గోరంట్ల సమీపంలోని బ్రిడ్జిపై ఇనుప కడ్డీలు తేలడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ప్రారంభించిన రెండు మూడేళ్లకే ఇనుప కడ్డీలు తేలడంతో సంబంధిత గుత్తేదారు పనులు నాసిరకంగా చేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై మంత్రి సవిత దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. తాత్కాలికంగా అపాయకరంగా మారిన ఇనుప కడ్డీలను తొలగించడమో, వాటిపై కాంక్రీట్ వేయడమో చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.


