News March 14, 2025

పవన్ కళ్యాణ్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి

image

పిఠాపురంలోని చిత్రాడ వద్ద మరికాసేపట్లో మొదలుకానున్న ‘జనసేన జయకేతనం’కు ఉపముఖ్యమంత్రి హాజరుకానున్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకి ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఆయన భవిష్యత్తు రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News July 11, 2025

GHMCకి మీడియాకు వారానికోసారి ఎంట్రీ?

image

జర్నలిస్టులు ఇక ఎప్పుడు పడితే అప్పుడు GHMC ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి వీలుపడకపోవచ్చు. రెగ్యులర్ జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ ఛానళ్ల వారు నిత్యం అధికారులను కలిసేందుకు వస్తున్నారని, దీంతో విధినిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రిడిటేషన్ ఉన్న వారిని మాత్రమే వారానికి ఒకసారి అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం.

News July 11, 2025

HYD: మాయం కానున్న ఆ మూడు పార్టీలు!

image

తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్‌సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.

News July 11, 2025

‘కొండ’ను ఢీకొనడం కష్టమే..!

image

నలుగురు ఎమ్మెల్యేలు జట్టుకట్టినా కొండా దంపతులను ఢీకొనడం సాధ్యం కావడం లేదు. ఇద్దరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నలుగురు ఎమ్మెల్యేలు ఏకమై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట ఏకరువు పెట్టినా ఏం చేయలేకతున్నారనే టాక్ ఓరుగల్లులో ఉంది. ఉమ్మడి వరంగల్‌లో 7 స్థానాలను తామే గెలిపించామని, వాళ్లకు అంత సీన్ లేదంటూ కొండా దంపతులు కార్యకర్తలతో బాహాటంగానే చెప్తుండడం చూస్తుంటే నిజమేనని తెలుస్తుంది.