News April 8, 2025
పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలి: రోజా

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ‘ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలి. దీర్ఘాయుష్సుతో ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News December 24, 2025
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News December 24, 2025
కొత్త సంవత్సరంలో ఇంట్లోకి ఇవి తెచ్చుకోండి

న్యూ ఇయర్లో అదృష్టం వరించాలంటే ఇంట్లోకి శ్రీయంత్రం, శాలిగ్రామం, స్వస్తిక్ గుర్తులను తీసుకురావాలని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘ఇంటి ఆవరణలో తులసి, మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ మొక్కలు నాటండి. తులసి కోట వద్ద శాలిగ్రామాన్ని ఉంచి పూజిస్తే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి’ అని చెబుతున్నారు.
News December 24, 2025
నాగర్కర్నూల్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్కర్నూల్, పదర, పెంట్లవెల్లి, తాడూరు, తెల్కపల్లి, తిమ్మాజీపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే <


