News April 29, 2024

పవన్ మండపేట పర్యటన తాత్కాలికంగా వాయిదా

image

ఏప్రిల్ 30వ తేదిన ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా మండపేట నియోజకవర్గంలో జరగాల్సిన వారాహి విజయభేరి బహిరంగ సభ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని కూటమి శ్రేణులు గమనించాలని, ఇదే వారంలో తిరిగి పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని పేర్కొంది. తేదీ ఖరారు కాగానే వివరాలు తెలియజేస్తామని నాయకులు తెలిపారు.

Similar News

News December 12, 2025

తూ.గో: షార్ట్ ఫిలిం తీసేందుకు పోలీసుల ఆహ్వానం

image

వివిధ విభాగాలలో షార్ట్ ఫిలిం తీసే ఔత్సాహికులకు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఆహ్వానం పలుకుతున్నారు. జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు నాలుగు విభాగాలపై షార్ట్ ఫిలిం తీయనున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్ అవేర్‌నెస్‌పై దరఖాస్తులు ఆహ్వానించారు. విజేతలకు రూ.10 వేలు నగదు అందజేస్తారు. డిసెంబర్ 25లోగా పంపాలని, 6 నిమిషాల నిడివి ఉండాలన్నారు.

News December 12, 2025

రాజమండ్రి: పెట్రోల్ దొంగతనం చేస్తున్నాడని హత్య.. జైలు

image

కడియానికి చెందిన రాయ వెంకన్న, నల్లి శేఖర్‌లకు 7 సం.లు జైలు శిక్ష, రూ. 5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018 సెప్టెంబర్లో కడియం (M) M. R పాలేనికి చెందిన శీలం సంతోశ్ (13) మోటారు సైకిళ్లలో పెట్రోల్ చోరీ చేస్తున్నాడనే నెపంతో వెంకన్న, శేఖర్ కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదయింది. దీనిపై జిల్లా జడ్జి గంధం సునీత శిక్ష ఖరారు చేశారు.

News December 12, 2025

“తూర్పు” కలెక్టర్ కీర్తి చేకూరికి 13వ ర్యాంకు

image

తూ.గో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తన పని తీరుతో ఎపీలో 13వ ర్యాంక్ పొందారు. గత 3 నెలల వ్యవధిలో కలెక్టర్లు పరిశీలించిన ఫైళ్ల క్లియరెన్స్ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం గ్రేడ్స్ ప్రకటించింది. ఇందులో తూర్పు కలెక్టర్ కీర్తి.. ఫైల్ పరిశీలనకు సగటున 1 రోజు 21 గంటల సమయం తీసుకున్నారు. కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ 21, కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ 26వ స్థానాల్లో నిలిచారు.