News October 4, 2024
పవన్ స్పీచ్‌లో తమిళ ప్రస్తావన ఎందుకు..?

తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళ ప్రస్తావనపై చర్చ జరుగుతోంది. లడ్డూ వివాదం తమిళనాడులోని ఓ కంపెనీ చుట్టూ తిరుగుతోంది. మరోసారి తమిళనాడుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. అక్కడి రాజకీయాల్లో ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఇలా స్పందించారా అని అందరూ భావిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై తమిళనాడు ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Similar News
News October 23, 2025
చిత్తూరులో భద్రత కట్టుదిట్టం.!

చిత్తూరు మాజీ మేయర్ కటారి <<18085908>>అనురాధ దంపతుల<<>> హత్య కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. CHUDA చైర్పర్సన్ కె.హేమలత, మాజీ MLA సి.కె.బాబు నివాసాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా న్యాయమూర్తి, APP, డిఫాక్టో కంప్లైనెంట్ నివాసాల వద్ద సైతం భద్రత పెంచారు. నేరపూర్వ చరిత్ర ఉన్న వారిపై నిఘా కొనసాగుతోందని DSP సాయినాథ్ తెలిపారు.
News October 23, 2025
రేపే కటారి దంపతుల హత్య కేసు ఫైనల్ జడ్జిమెంట్

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ <<18079030>>హత్య కేసు<<>>లో శుక్రవారం తీర్పు వెలువడనుంది. 10 ఏళ్ళ పాటు ఈ కేసుపై విచారణ సాగింది. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అలర్లు జరగకుండా పోలీసులు కోర్టు వద్ద పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంచారు. గుంపులుగా చేరడం, తిరగడంపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. కోర్టు పరిసరాల్లో సిబ్బందికి తప్ప మరెవరికి అనునతి లేదని వారు స్పష్టం చేశారు.
News October 23, 2025
చిత్తూరు: రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

చిత్తూరు జిల్లాలోని పాఠశాలలు శుక్రవారం తెరుచుకోనున్నట్లు DEO వరలక్ష్మి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు తలెత్తకుండా స్కూళ్లలో తగు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల పరిధిలో కాలువలు, కుంటలు ఉంటే అక్కడికి విద్యార్థులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. విద్యార్థులను వేడి నీరు అందించే ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆమె కోరారు.