News March 31, 2025

పవిత్ర ఖురాన్ బోధనలు సమాజానికి మేలు చేస్తున్నాయి: గవర్నర్ 

image

రంజాన్ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్ భవన్ నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పవిత్ర ఖురాన్ బోధనలు సమాజానికి మేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేసే ముస్లింలంతా భగవంతుడికి చేరువ అవుతారని గవర్నర్ వ్యాఖ్యానించారు. 

Similar News

News November 22, 2025

నిర్మల్: మండలాలకు ఫాగింగ్ మెషీన్ల పంపిణీ

image

జిల్లాలోని పారిశుద్ధ్యం, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 18 ఫాగింగ్ యంత్రాలను మండలానికి ఒకటి చొప్పున ఎంపీఓలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అందించారు. ఫాగింగ్ యంత్రాలను సమర్ధవంతంగా వినియోగించాలని సూచించారు. దోమలను సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు.

News November 22, 2025

సున్నాకే 2 వికెట్లు.. వైభవ్‌ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు?

image

ACC రైజింగ్ స్టార్స్ టోర్నీ సెమీస్‌లో భారత్-A ఘోరంగా ఓడిపోవడం తెలిసిందే. <<18351593>>సూపర్ ఓవర్‌‌లో<<>> ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోవడంతో బంగ్లా ఈజీగా గెలిచేసింది. ఈ నేపథ్యంలో ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని సూపర్ ఓవర్‌లో ఎందుకు బ్యాటింగ్‌కు పంపలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ బ్లండర్ మిస్టేక్ వల్ల మ్యాచ్ ఓడిపోయామని మండిపడుతున్నారు. వైభవ్ ఆడుంటే ఇంకోలా ఉండేదని అంటున్నారు. మీరేమంటారు?

News November 22, 2025

అధికారి కొడుకు, కూలీ కొడుకు పోటీ పడేలా చేయలేం: సీజేఐ

image

SC, ST రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై తన తీర్పుకు కట్టుబడి ఉన్నానని CJI జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. సీఎస్ కొడుకును వ్యవసాయ కూలీ కొడుకుతో పోటీ పడేలా చేయలేమని అన్నారు. ‘ఆర్టికల్ 14 సమానత్వాన్ని నమ్ముతుంది. అంటే అందరినీ సమానంగా చూడాలని కాదు. వెనుకబడిన వారిని ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. సమానత్వ భావనంటే ఇదే’ అని చెప్పారు. తన చివరి వర్కింగ్ డే సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.