News October 27, 2024

పశుగణన వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి బీసీ

image

21వ అఖిలభారత పశుగణనకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.గోవింద్ నాయక్‌తో కలిసి ఆవిష్కరించారు. నాలుగు నెలల పాటు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమానికి రైతు సోదరులందరూ సహకరించాలన్నారు. పశువైద్యాధికారి రామ్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

image

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్‌పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.

News December 6, 2025

హోంగార్డుల సేవలు ప్రశంసనీయం: జిల్లా SP.!

image

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు, సేవలు ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. శనివారం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో ముందుంటారన్నారు.

News December 6, 2025

బిల్వ స్వర్గం గుహల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్.!

image

నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని కనుమకింది కొట్టాల గ్రామ సమీపాన ఉన్న బిళ్ళస్వర్గం గుహల వద్ద సినిమా షూటింగ్ సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా యూనిట్ బృందం గుహల సన్నివేశాల చిత్రీకరణ కోసం వచ్చింది. దీంతో ఈ సందర్భంగా సినిమా యూనిట్ బృందం తరలిరావడంతో గుహల్లో సందడి వాతావరణం నెలకొంది.