News October 27, 2024
పశుగణన వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి బీసీ
21వ అఖిలభారత పశుగణనకు సంబంధించిన వాల్ పోస్టర్లను శనివారం బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.గోవింద్ నాయక్‌తో కలిసి ఆవిష్కరించారు. నాలుగు నెలల పాటు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమానికి రైతు సోదరులందరూ సహకరించాలన్నారు. పశువైద్యాధికారి రామ్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 11, 2024
విషాదం.. మహానంది కోనేటి వద్ద మూర్చకు గురైన బాలుడి మృతి
మహానంది క్షేత్రంలోని కోనేరు వద్ద స్నానమాచరిస్తూ మూర్చకు గురైన బాలుడు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. సోమవారం తాడిపత్రికి చెందిన భక్తులు స్నానమాచరిస్తుండగా మూర్చకు గురికావడంతో 108 వాహనంలో నంద్యాలకు తరలించారు. మార్గమధ్యంలో తాడిపత్రి మండలం సేనగల గూడూరుకు చెందిన 9 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు.
News November 11, 2024
యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్, నవీన్ పాటి
యూటీఎఫ్ కర్నూలు జిల్లా నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్, నవీన్ పాటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గూడూరులో జరిగిన జిల్లా స్వర్ణోత్సవ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా నవీన్ పాటి, ఆర్థిక కార్యదర్శిగా యెహోషువ, సహాధ్యక్షులుగా హేమంత్ కుమార్, జీవిత, గౌరవాధ్యక్షుడిగా దావీదు ఎన్నికయ్యారు.
News November 11, 2024
పరిశ్రమలు & వాణిజ్య శాఖకు రూ.3,127 కోట్లు
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పరిశ్రమలు & వాణిజ్య శాఖకు రూ.3,127 కోట్లతో బడ్జెట్ కేటాయింపును ఆ శాఖ మంత్రి టీజీ భరత్ అసెంబ్లీలో ప్రతిపాదించారు. పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0 తీసుకొచ్చామని, పారిశ్రామిక వాడల ఏర్పాటు ప్రత్యేక విధానం తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.