News November 13, 2024

పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం

image

ఆస్పరి: రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జేడి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గ్రామ పశు వైద్య కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఎన్ఎల్ఎం ద్వారా గొర్రెల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 5, 2024

బేతంచర్లలో అల్లు ఫ్యాన్స్ భారీ హంగామా

image

జిల్లాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగుతోంది. ‘పుష్ప-2’ విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ కటౌట్స్‌కి పాలాభిషేకాలు, పూలమాలలు వేస్తూ డప్పులు, వాయిద్యాలతో రచ్చ చేస్తున్నారు. బేతంచర్లలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద బన్నీ ఫ్యాన్స్ ఏకంగా పొట్టేలు బలి ఇచ్చారు. ఆ రక్తంతో అభిషేకం చేశారు. భారీ నిమ్మకాయల దండ, అల్లు అర్జున్ కటౌట్స్‌‌తో పట్టణ వీధుల్లో తిరిగారు.

News December 5, 2024

అల్లు అర్జున్‌తో శిల్పా రవి

image

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి బుధవారం రాత్రి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ‘పుష్ప-2’ ప్రీమియర్ షోను వీక్షించి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోను శిల్పా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనికి పుష్ప-2 వైల్డ్ ఫైర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

News December 5, 2024

కర్నూలులో 4 మి.మీ వర్షపాతం

image

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కర్నూలు జిల్లాలో నిన్న వర్షాలు కొనసాగాయి. 11 మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా కర్నూలులో 4 మి.మీ, అత్యల్పంగా మంత్రాలయంలో 1 మి.మీ వర్షపాతం నమోదైంది. మరోవైపు నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.