News January 28, 2025

పశుపోషకులకు అండగా నిలిచేందుకే శిబిరాలు: కలెక్టర్

image

పశుపోషకులకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందని పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. ములకలూరు గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. స్వయంగా నట్టల నివారణ మందును జీవాలకు ఇచ్చారు. లేగ దూడలను సంరక్షించాలని అవే రేపటి పాడిపశువులన్నారు. 1962 పశు వైద్య సంచార వాహన సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్డీవో మధులత, ఎంపీడీవో,పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు.

Similar News

News February 26, 2026

AI వల్ల ఆదాయం తగ్గినా ఓకే: TCS CEO

image

AI వల్ల కంపెనీ ఆదాయం తగ్గినా పర్లేదని TCS CEO కృతివాసన్ స్పష్టం చేశారు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం తమకు లేదని, పైగా తమ 6 లక్షల మంది ఉద్యోగులు ఇందులో నైపుణ్యం సాధించాలని ఆదేశించారు. సీనియర్ల కంటే జూనియర్లే దీన్ని వేగంగా ఒంటబట్టించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. AIని కేవలం వాడుకోవడం కాకుండా కొత్త సొల్యూషన్స్ బిల్డ్ చేయాలని ఉద్యోగులకు సూచించారు.

News February 26, 2026

IND vs ZMB: టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనా?

image

T20 WC S-8లో నేడు భారత్, జింబాబ్వే చెన్నై వేదికగా తలపడనున్నాయి. తొలి మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లకూ ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన టైమ్. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని ‘డ్యూ ఫ్యాక్టర్’ శాసించేలా ఉంది. రాత్రి వేళ మంచు కురిస్తే బౌలర్లకు గ్రిప్ కష్టమై బ్యాటర్లు భారీ స్కోర్లు చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన టీమ్ చేజింగ్ వైపే మొగ్గు చూపొచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా సెమీస్ ఆశలు నిలవాలంటే భారత్ గెలవాల్సిందే.

News February 26, 2026

పెద్దన్నను కాదని భారత్‌కు ఇజ్రాయెల్ సాయం

image

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించి మరీ భారత్‌కు ఇజ్రాయెల్ రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది. 1980లలో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకూ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’కూ ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని నెతన్యాహు గతంలో ప్రకటించారు. రక్షణ, వ్యవసాయం, AI రంగాల్లో ఇరు దేశాల సహకారం ఇప్పుడు మరింత బలోపేతమైంది.