News February 22, 2025
పశువులకు శస్త్ర చికిత్సలు అందించాలి: ASF కలెక్టర్

జిల్లాలోని పశువులకు వాతావరణ మార్పులకు అనుగుణంగా అవసరమైన వైద్య చికిత్సలను సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ పశు వైద్య కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. భవన పరిసరాలు, రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా పశు వైద్య కార్యాలయానికి సంబంధించి ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో కవిత

కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గురువారం నాగిరెడ్డిపేట్ గ్రామంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ముంపు రైతులతో సమావేశం అయ్యారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు రెండేళ్ల కింద నోటికి ఏదీ వస్తే అది చెప్పి ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇప్పుడు మాత్రం కనబడకుండా పోయారన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కనబడని పరిస్థితి ఉందన్నారు.
News November 27, 2025
ఆసిఫాబాద్ ఎస్ఈగా జాడే ఉత్తమ్ బాధ్యతల స్వీకరణ

ఎన్పిడిసిఇఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్గా జాడే ఉత్తమ్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మంచిర్యాలలో ఎస్ఈగా పనిచేసిన ఆయన బదిలీపై ఆసిఫాబాద్ వచ్చారు. మాజీ ఎస్ఈ శేషారావు ఆదిలాబాద్కు మారారు. జిల్లా వ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని ఉత్తమ్ తెలిపారు.


