News March 6, 2025
పశువులు పట్టివేత.. 8మంది అరెస్ట్

అక్రమంగా పశువులను తరలిస్తున్న 8 మందిని వెంకటాపురం పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. సిఐ కుమార్ తెలిపిన వివరాలు.. చర్ల నుంచి HYDకు అక్రమంగా పశువులు తరలిస్తున్నారని సమాచారంతో చొక్కాల గ్రామ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. 4 బొలెరో వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వాహనాల్లోని 42 పశువులను గోశాలకు తరలించి, 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News December 3, 2025
సంగారెడ్డి: సర్పంచ్ పదవికి 1,444 నామినేషన్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో 243 సర్పంచ్ స్థానాలకు 1,444 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం బుధవారం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలు పోటీ చేసే అభ్యర్థులు పాటించాలని సూచించారు.
News December 3, 2025
తుఫాన్.. బాపట్ల జిల్లాకు ఎల్లో అలర్ట్

దిత్వా తుఫాన్ నేపథ్యంలో బాపట్ల జిల్లాకు వాతావరణ శాఖ బుధవారం ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయం ఎల్లో అలర్ట్ తెలిపే ఓ మ్యాప్ను విడుదల చేసింది. దీని ప్రభావంతో రానున్న 3గంటల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని సూచించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్యాలయం పేర్కొంది.
News December 3, 2025
నర్సంపేటకు వరాల జల్లు..!

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ఈ నెల 5న నర్సంపేట పర్యటనకు రానున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆహ్వానం మేరకు సీఎం ఈ పర్యటనలో పాల్గొని దాదాపు రూ.1,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ.45 కోట్లతో నర్సింగ్ కాలేజీ, రూ.20 కోట్లతో సైడ్ డ్రైనేజీలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.


