News March 19, 2025
పశువుల షెడ్డులో 12 అడుగుల గిరినాగు..!

మాడుగులలో బుధవారం 12 అడుగుల భయంకరమైన గిరినాగు హల్ చల్ చేసింది. మాడుగుల మోదమాంబ కాలనీలో కనక అనే మహిళ ఈ గిరినాగును తన పశువుల షెడ్డులో చూసి భయాందోళన చెంది కుమారుడు గణేశ్‌కు విషయం చెప్పింది. దీంతో గణేశ్ స్నేక్ క్యాచర్ వెంకటేశ్‌కు సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా ఈ గిరి నాగును బంధించారు. ఈ గిరినాగును వంట్లమామిడి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని స్నేక్ క్యాచర్ వెంకటేశ్ తెలిపారు.
Similar News
News March 20, 2025
పాడేరు: ‘నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం’

నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కలెక్టర్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ నుంచి నాటుసారా నివారణపై రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమ నాటుసారా తయారీదారులపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలని సూచించారు. నాటుసారా నివారణకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు.
News March 20, 2025
IPL రూల్స్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

IPLలో కొన్ని రూల్స్‌పై బీసీసీఐ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 బంతులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను యథావిధిగా కొనసాగించనుంది.
News March 20, 2025
మహబూబ్‌నగర్: బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్ర మంత్రికి వినతి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా & రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.