News March 14, 2025
‘పశు బీమాను సద్వినియోగం చేసుకోవాలి’

పశు బీమాను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి రామ్మోహన్రావు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశువులకు 80శాతం రాయితీతో బీమా అందిస్తున్నాయన్నారు. తెల్ల రేషన్ కార్డున్న పాడి రైతులంతా ఈ బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండేళ్ల కాలంలో 10,231 పశువులకు బీమా చేయగా, మృతి చెందిన 179 పశువులకు మంజూరైన రూ.52,98,000 బీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు.
Similar News
News December 22, 2025
ఆవు పొదుగులోనే అరవై ఆరు పిండివంటలూ..

ఆవు పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల నుంచి అనేక రకాలైన వంటకాలు, పిండి వంటలను తయారు చేయవచ్చు. ఈ సామెత ఆవు పాలు, వాటి ఉత్పత్తుల యొక్క గొప్పతనాన్ని, అవి అందించే విస్తృతమైన ప్రయోజనాలను, వంటకాల వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఆవు పాలు ఎన్నో రకాలైన రుచికరమైన, సాంప్రదాయకమైన ఆహార పదార్థాలకు మూలాధారమని దీని అర్థం.
News December 22, 2025
మట్టితో చేసిన శివలింగాన్ని ఎందుకు పూజించాలి?

మట్టితో చేసిన శివలింగాన్ని పార్థివ లింగం అంటారు. దీన్ని పూజించడం అత్యంత శ్రేష్ఠం. స్వహస్తాలతో చేసిన లింగాన్ని శుద్ధమైనదిగా పరిగణిస్తారు. దీన్ని ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. 16 సోమవారాల వ్రతంలో ప్రతి వారం కొత్తది కూడా చేసుకొని పంపించవచ్చు. అభిషేకాలూ చేయవచ్చు. అలాగే నిమజ్జనానికి కూడా అనుకూలంగా ఉంటుంది. నిష్ఠతో మట్టి లింగాన్ని చేసి ఆరాధించడం శివానుగ్రహం సులభంగా లభించి, కష్టాలన్నీ పోతాయని నమ్మకం.
News December 22, 2025
నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ

TG: ఇవాళ మ.2 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో CM రేవంత్ మంత్రులతో భేటీకానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను నేడు ఖరారు చేసే అవకాశముంది. అలాగే సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, బడ్జెట్ కసరత్తు, MPTC, ZPTC ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్పై మంత్రులతో చర్చించనున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ, వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


