News March 28, 2024

పశ్చిమ ప్రకాశంను వీడని కరువు.. ప్రజల వలస

image

కరువుతో పశ్చిమ ప్రకాశం ప్రజలు వలసబాట పడుతున్నారు. ఉన్న ఊళ్లో బతుకుభారమై పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాలకు తరలి వెళ్తున్నారు. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో చాలా గ్రామాలు జనం లేక వెలవెలబోతున్నాయి. అడపాదడపా తాగునీరు అందిస్తున్నప్పటికీ చాలీచాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు కరువు నివారణకు కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు..

Similar News

News February 10, 2026

ప్రకాశం: ‘సొంత చెల్లిపై అన్న లైంగిక దాడి’

image

సొంత చెల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డ అన్నకు విజయవాడ పోక్సో కోర్టు సోమవారం ‘జీవిత‌ ఖైదు’ విధించింది. ప్రకాశం(D) కొండపి(M) పెట్లూరుకి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు సంతానం. భార్య విడిపోయి ఇద్దరు కూతుర్లతో కృష్ణా జిల్లాకు వెళ్లగా కొడుకు తండ్రి వద్దే ఉన్నాడు. ఈ క్రమంలో అమ్మవద్దకు వెళ్లొస్తానన్న కొడుకు పెద్దచెల్లి(17)పై లైంగిక దాడి చేశాడు. కుమార్తె గర్భిణీ కాగా తల్లి కేసు పెట్టడంతో నిన్న శిక్ష పడింది.

News February 10, 2026

మార్కాపురం నుంచి శ్రీశైలానికి 80 RTC బస్సులు

image

శ్రీశైలం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్కాపురం డిపో RTC బస్సులు ఏర్పాట్లు చేసింది. మార్కాపురం నుంచి శ్రీశైలానికి సోమవారం నుంచి 18వతేదీ వరకు 80 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య సోమవారం తెలిపారు. 14, 15,16 తేదీల్లో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఆ రోజుల్లో కూడా మరికొన్ని సర్వీసులు కూడా నడిపేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని DM చెప్పారు.

News February 10, 2026

ప్రకాశం జిల్లా SP స్పందనకు 124 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.