News July 22, 2024

పసుపు చొక్కాలో కనిపించిన నారా లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సాధారణంగా తెల్ల చొక్కాతో కనిపించే ఆయన ఇవాళ పసుపు చొక్కాలో మెరిశారు. ఆయన లాగే కొందరు పసుపు దుస్తులతో రాగా, మరికొందరు కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు. మరోవైపు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

Similar News

News December 1, 2025

గుంటూరులో వ్యభిచార ముఠా అరెస్ట్

image

గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారంపై టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. గాంధీ పార్క్ వెనుక ఉన్న రామిరెడ్డి నగర్‌లోని ఒక లాడ్జ్‌పై దాడి చేసి, ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలను సహించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.

News December 1, 2025

ఈ నెల 5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: కలెక్టర్

image

మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.‌ అదేవిధంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 1, 2025

GNT: మళ్లీ తెరపైకి ఆ ఎంపీ పేరు.!

image

2026 జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఈ నేపధ్యంలో టీడీపీ రాజ్యసభ రేసులో గల్లా జయదేవ్ పేరు మళ్లీ వినిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. పరిశ్రమలు, పెట్టుబడులపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలు, పరిపాలనలో పారదర్శకతకు ఆయన ఇచ్చే ప్రాధాన్యం మళ్లీ హైలైట్ అవుతోంది. కాగా గతంలో గుంటూరు జిల్లా నుంచి అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి ఇద్దరు రాజ్యసభకి ఎన్నికవటంతో గల్లా పేరుకు ప్రాముఖ్యం ఉంది.