News May 22, 2024
పాకాల: కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం లభ్యం

పాకాలలోని రైలు పట్టాలపై బుధవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తలారివారిపల్లెకు చెందిన మురళీగా వారు గుర్తించారు. కాగా శుక్రవారం ఫకీరుపేటకు చెందిన ఓ యువతిని మురళీ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మురళీ కనిపించకుండా పోగా.. నేడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. యువతి కుటుంబ సభ్యులే మురళీని హత్య చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు.
Similar News
News December 10, 2025
చిత్తూరు: కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకోవాలని వినతి

ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవాలని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు వైసీపీ ఎంపీలు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాజంపేట, తిరుపతి ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ సుబ్బారెడ్డి తదితరులు ఆమెకు వినతిపత్రం అందజేశారు. కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు.
News December 10, 2025
పలమనేరు-కుప్పం హైవేపై లారీ-RTC బస్సు ఢీ

పలమనేరు-కుప్పం జాతీయ రహదారిలోని వీకోట(M) జీడీగుట్ట సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC బస్సు ఢీకొనడంతో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. విజయవాడ నుంచి కుప్పం వస్తున్న ఆర్టీసీ లగ్జరీ బస్సు జీడీగుట్ట వద్ద ఆగి ఉన్న లారీని వెనకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కుప్పం PES, ఏరియా ఆసుపత్రికి తరలించారు.
News December 9, 2025
చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు ఇవే..!

చిత్తూరు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘాతో పాటు అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పీసీ & పీఎన్‌డీటీ చట్టం కింద జిల్లాస్థాయి బహుళ సభ్యుల అప్రూవింగ్ అథారిటీపై సమీక్షించారు.


