News February 27, 2026
పాక్-అఫ్గాన్ బార్డర్‌లో యుద్ధ వాతావరణం

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఇటీవల జరిపిన<<19206132>> వైమానిక దాడులకు<<>> ప్రతీకారంగా తాలిబన్లు భారీ ఆపరేషన్ మొదలెట్టారు. డురాండ్ లైన్ వెంట పాక్‌కు చెందిన 15 చెక్‌పోస్టులను అధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 40 మంది పాక్ సైనికులు చనిపోయారని మరికొందరిని బంధించామని తెలిపింది. అటు పాక్ కూడా దీటుగా బదులిస్తున్నామని, పలువురు తాలిబన్లను చంపామని అంటోంది.
Similar News
News April 15, 2026
పెండింగ్ పనుల జిల్లా ‘నిర్మల్’

జిల్లాలో అభివృద్ధి పనులు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ రైల్వే లైన్ కలగానే మిగిలిపోగా, ఈఎస్ఐ ఆస్పత్రి, భైంసా డిస్పెన్సరీ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతుండటంతో రైతాంగం ఆవేదన చెందుతోంది. పరిశ్రమల స్థాపన లేక నిరుద్యోగం పెరుగుతోందని, పాలకుల ఉదాసీనత వల్ల జిల్లా వెనుకబడిందని వాపోతున్నారు.

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర వరుసగా రెండో రోజు భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,420 ఎగసి రూ.1,55,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,300 పెరిగి రూ.1,42,400 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.10,000 ఎగసి రూ.2,65,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.