News February 7, 2025
పాచిపెంటలో యువకుడి మృతి
పాచిపెంట మండలం పీ.కొనవలస ఘాట్ రోడ్డులో గురువారం స్కూటీని లారీ ఢీ కొట్టడంతో ఒడిశా రాష్ట్రం పొట్టంగికి చెందిన డి.కృష్ణ సుందరి మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. ఒడిశా నుంచి సిమెంట్ లోడుతో సాలూరు వైపు వస్తున్న లారీ స్కూటీని ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో స్కూటీపై వెళుతున్న ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. లారీ క్లీనర్‌కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 7, 2025
మీ డ్రీమ్స్‌లోనూ ఇవే వస్తుంటాయా?
మన దగ్గర ఎక్కువ మంది కలలో పాము కనిపించిందని చెప్తుంటారు. అయితే, దేశాలను బట్టి వారి డ్రీమ్స్‌లో వచ్చేవి కూడా మారుతాయని ఓ అధ్యయనంలో తేలింది. అర్జెంటీనాలో ఎక్కువ మందికి స్పైడర్స్, AUS & కెనడా వారికి పళ్లు ఊడిపోయినట్లు, బంగ్లాదేశ్ ప్రజలకు పెళ్లి జరిగినట్లు కలలొస్తాయి. ఫ్రాన్స్ ప్రజలకు తమ మాజీ గర్ల్‌ఫ్రెండ్ డ్రీమ్స్‌లోకి వస్తుందని చెప్పారు. బ్రెజిల్ & ఆస్ట్రియా వాళ్ల డ్రీమ్స్‌లో మోస్ట్ కామన్ పామే.
News February 7, 2025
రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌పై వేటు
రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్’ చీఫ్ యూరీ బొరిసోవ్ను పుతిన్ తొలగించారు. అతడి స్థానంలో డిప్యూటీ రవాణామంత్రి దిమిత్రీ బకనోవ్‌ను నియమించారు. 2022 జులై నుంచి యూరీ రాస్‌కాస్మోస్ చీఫ్‌గా ఉన్నారు. ఆయన హయాంలోనే 2023లో చంద్రుడిపైకి పంపిన లూనా-25 మిషన్ విఫలమై చంద్రుడి ఉపరితలంపై పడిపోయింది. రోదసి పరిశోధనల్లో సంస్థ ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండటమే తొలగింపు వెనుక కారణమని తెలుస్తోంది.
News February 7, 2025
పాక్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసిన ఫిఫా
పాకిస్థాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(PFF)ను ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(FIFA) సస్పెండ్ చేసింది. నిబంధనలను పాటించడంలో విఫలమైందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. PFFలో సజావుగా ఎన్నికల నిర్వహణ, గ్రూపిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా 2019లో నార్మలైజేషన్ కమిటీని ఫిఫా ఏర్పాటు చేసింది. కానీ సత్ఫలితాలు రాలేదు. దీంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 నుంచి PFF సస్పెన్షన్‌కు గురికావడం ఇది మూడోసారి.