News March 20, 2025

పాఠశాలను తనిఖీ చేసిన MHBD అదనపు కలెక్టర్

image

కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఎంపికైన పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ పరిశీలించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష జరిగే సమయాల్లో పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు మూసివేసి 144 సెక్షన్ విధించడం జరుగుతుందన్నారు.

Similar News

News March 31, 2025

తుని: పేకాట శిబిరంపై దాడి.. 10 మంది అరెస్ట్

image

తుని పట్టణంలోని కొండవారిపేటలో గుట్టుచప్పుడు లేకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పట్టణ సీఐ గీతా రామకృష్ణ తన సిబ్బందితో కలిసి ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో పదిమంది వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2,100 నగదు సీజ్ చేశారు. పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారంతో ఈ దాడులు చేసినట్లు సీఐ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

News March 31, 2025

నేటితో ముగియనున్న గడువు

image

AP: ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50% రాయితీ ప్రకటించగా శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు, మొత్తంగా రూ.204 కోట్లు వసూలయ్యాయి. రంజాన్ కారణంగా ఇవాళ సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉ.9 నుంచి రా.9 వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది సందర్భంగా ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేదు.

News March 31, 2025

తెలంగాణలో అతి తక్కువ ద్రవ్యోల్బణం

image

TG: దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైనట్లు NSO తెలిపింది. రాష్ట్రంలో ఇది 1.3 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కేరళలో అత్యంత ఎక్కువ ద్రవ్యోల్బణం (7.3 శాతం) నమోదైనట్లు పేర్కొంది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ (4.9%), కర్ణాటక, బిహార్ (4.5%), జమ్మూ కశ్మీర్ (4.3%)లో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నట్లు పేర్కొంది. దేశంలోని 12 రాష్ట్రాలు 4 శాతం కంటే దిగువన ద్రవ్యోల్బణం నమోదు చేశాయి.

error: Content is protected !!