News February 11, 2025
పాఠశాలలకు కోడిగుడ్లు పంపిణీ నిలుపుదల: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739270520245_52165958-normal-WIFI.webp)
బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో వారం రోజులు పాఠశాలలకు, అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సాంఘిక వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలన్నారు.
Similar News
News February 12, 2025
ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.35వేలు ఇవ్వాలి: కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738600740850_367-normal-WIFI.webp)
TG: ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని MLC కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని, ఒక్కో మహిళకు సర్కార్ ₹35వేలు జమ చేయాలని అన్నారు. మహిళా దినోత్సవంలోపు ఈ హామీని నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడతామని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
News February 12, 2025
ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739285963734_20471762-normal-WIFI.webp)
ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలను పునరుద్ధరించారు. గత సెప్టెంబర్ నెలలో వరదలకు దెబ్బతిన్న వంతెన మరమ్మతులు పూర్తి చేసి, మంగళవారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను అనుమతించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రకాష్ నగర్ వంతెన 9 పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం ఆధునిక టెక్నాలజీ వినియోగించి పనులు పూర్తి చేసిందన్నారు.
News February 12, 2025
సినీ పరిశ్రమకు మేం వ్యతిరేకం కాదు: పుష్ప శ్రీవాణి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739307629195_893-normal-WIFI.webp)
AP: విశ్వక్సేన్ ‘లైలా’ సినిమాకి తాము వ్యతిరేకం కాదని YCP నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. తమపై జోకులు వేసే ఆర్టిస్టులకు మాత్రమే తాము వ్యతిరేకం అని, సినీ పరిశ్రమకు కాదని పేర్కొన్నారు. YCPపై జోకులు వేసే ఆర్టిస్ట్ నటించే ప్రతి సినిమాని బాయ్కాట్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘టికెట్ కొనుక్కొని మరీ మా మీద మీతో జోకులు వేయించుకొనేంత పిచ్చి గొర్రెలం మాత్రం కాదు’ అని ట్వీట్ చేశారు.