News February 11, 2025
పాఠశాలలకు కోడిగుడ్లు పంపిణీ నిలుపుదల: కలెక్టర్

బర్డ్ ఫ్లూ తో కోళ్లు మరణిస్తున్న నేపథ్యంలో వారం రోజులు పాఠశాలలకు, అంగన్వాడీలకు కోడిగుడ్లు పంపిణీని నిలిపివేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో చర్చించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సాంఘిక వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పిల్లలకు కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలన్నారు.
Similar News
News March 28, 2025
మతం విషయంలో నా తల్లిదండ్రులకు సమస్య రాలేదు: సల్మాన్ ఖాన్

తన తల్లిదండ్రుల వివాహంలో హిందూ-ముస్లిం అనే తేడా ఎప్పుడూ రాలేదని సల్మాన్ ఖాన్ అన్నారు. వారికి వృత్తిపరమైన సమస్య తప్ప వేరే ఏది ఉండేది కాదని పేర్కొన్నారు. సికందర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాల్ని మీడియాతో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీమ్, సుశీల 1964లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సల్మా ఖాన్‌గా సుశీల పేరు మార్చుకున్నారు.
News March 28, 2025
NGKL జిల్లాలో 28 మంది విద్యార్థులు గైర్హాజరు: డీఈవో

జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ పరీక్ష కేంద్రాలను తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 60 కేంద్రాల్లో 10,584 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 10,556 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని అని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
News March 28, 2025
భూకంపం నుంచి తప్పించుకున్న తెలంగాణ MLA ఫ్యామిలీ

బ్యాంకాక్‌లో భూకంపం నుంచి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబం త్రుటిలో తప్పించుకుంది. రాజ్ ఠాకూర్ భార్య, కూతురు, అల్లుడు బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు. అక్కడ భారీ భూకంపం ధాటికి అనేక బిల్డింగులు కుప్పకూలాయి. అయితే ఆ ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వారు తిరిగి విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు.