News February 10, 2025

పాఠశాలలపై అపోహలు వద్దు: మంత్రి స్వామి

image

పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలులో బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాక ఫౌండేషన్, ప్రైమరీ, హైస్కూల్ కొనసాగింపు విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పంచాయితీకి ఒకటి మాత్రమే మోడల్ స్కూల్ ఉంటుందనే అపోహ వద్దన్నారు.

Similar News

News April 12, 2026

ప్రకాశం: కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి

image

ప్రకాశం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు(M)లో తండ్రి తన 13 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే 2, 3 రోజుల నుంచి బాలికకు కడుపు నొప్పి వస్తుండటంతో ఒంగోలు రిమ్స్‌ కు తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు PS హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2026

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం ధర్మవరంలో RMP డాక్టర్‌ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న CI సుబ్బరాజు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.