News April 1, 2025
పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: DEO

ఒంటిపూట బడులకు భిన్నంగా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి C.V రేణుక ఒక ప్రకటనలో హెచ్చరించారు. మార్చి 15 నుండి ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించినా కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు వాటిని పాటించడం లేదని డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 ని.ల వరకు మాత్రమే పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
Similar News
News November 1, 2025
వాట్సాప్ గ్రూపుల్లో సమాచారంపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం అవుతున్న సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. సామాజిక మాధ్యమాలను సరైన మార్గంలో వినియోగించడమే నోటీసుల ఉద్దేశమని తెలిపారు. గ్రూప్ అడ్మిన్లు సభ్యుల వివరాలు, సమాచారంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులపై ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ధృవీకరించిన సమాచారాన్నే పంచాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు
News November 1, 2025
గుంటూరులో ఈ నెల 7న జాబ్ మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల 7న గుంటూరు లాం చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాబ్ మేళా నిర్వహించనుంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. 30కి పైగా కంపెనీలు పాల్గొని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. 10వ తరగతి నుంచి బీటెక్ చదువుకున్న విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు.
News October 31, 2025
పంట పొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలి: కలెక్టర్

పంటపొలాల్లో వర్షపు నీటిని బయటకు పంపాలని జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు, నీటి వినియోగదారుల సంఘం ప్రతినిధులతో కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పంట దెబ్బతినకుండా కాపాడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేసి ఉన్నారని గుర్తు చేశారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.


