News May 23, 2024

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు ద్వారా విద్యార్థి దశ నుంచి ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తున్న రీతిలో ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News October 2, 2024

బీటెక్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో 2024- జనవరిలో జరిగిన బీటెక్ 1, 3వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రీవాల్యుయెషన్‌కై దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని కృష్ణా వర్సిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News October 2, 2024

సీఎం చంద్రబాబు మచిలీపట్నం షెడ్యూల్ ఇదే!

image

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మచిలీపట్నంలో పర్యటన వివరాలను సీఎం కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉండవల్లిలోని సీఎం స్వగృహం నుంచి ఉదయం 10 గంటలకు హెలిప్యాడ్ ద్వారా బయలుదేరి 10:20కు మచిలీపట్నం చేరుకుంటారన్నారు. అక్కడ 10:30 వరకు ప్రభుత్వ అధికారులతో సమావేశం అవుతారన్నారు. అనంతరం మచిలీపట్నంలోని పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.10కి తిరిగి ప్రయాణమవుతారని తెలిపారు.

News October 1, 2024

ఉమ్మడి కృష్ణాలో నూతన మద్యం దుకాణాలకు గెజిట్ విడుదల

image

నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి కృష్ణాలో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు విడుదల చేశారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో గెజిట్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 113, కృష్ణాజిల్లాలో 123 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరించి 11న టెండర్లు ఖరారు చేస్తారు.