News December 7, 2024

పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ: కలెక్టర్

image

పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరమని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట డీసీఆర్ జెడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడతాయన్నారు.

Similar News

News November 18, 2025

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.14.90 లక్షలు స్వాహా

image

నెల్లూరులోని దర్గామిట్ట పరిధికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.14.90 లక్షలు తీసుకున్నారని SP డా.అజిత వేజెండ్లకు సోమవారం ఫిర్యాదు చేశారు. బీవీ నగర్‌కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పించకుండా.. నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విచారించి న్యాయం చేయాలని కోరారు.

ముత్తుకూరు హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం రొయ్యలపాలెంలో జరిగిన హత్య కేసులో ముద్దాయి పాముల శీనయ్యకు జీవిత ఖైదుతోపాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు 3rd ADJ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2022 సం. ఏప్రిల్ 24న ముద్దాయి తన అన్నతో ఆస్తి విషయంలో గోడవ పడి అతని తలమీద కొట్టి ఇంటిని కాల్చి అతి కిరాతకంగా హత్య చేశాడు. తగిన సాక్ష్యాలను ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచడంతో నేరం రుజువై శిక్ష ఖరారు చేశారు.