News February 1, 2025

పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టండి: కలెక్టర్

image

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి విద్యాశాఖాధికారులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాఠశాల పునర్ వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు పాఠశాలకు చేసే రాకపోకలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News December 7, 2025

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 15 నుంచి గుడివాడకు వందే భారత్

image

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు ఈ నెల 15వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే నర్సాపురం, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వందే భారత్ రైలు నడపాలని ప్రయాణికుల కోరుతున్నారు.

News December 7, 2025

సిద్దిపేట: గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం

image

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామాల్లో మందు, విందులను అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. గతంలో గ్రామానికి 10 నుంచి 20 వరకు బెల్టుషాపులు ఉండేవి. ప్రస్తుత జిల్లా సీపీ ఎస్ఎం విజయ్ కుమార్ బెల్టుషాపులను నియంత్రణలోకి తేవడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున వైన్ షాపుల బాట పట్టారు. ప్రత్యేకంగా డంపు చేసి, మందుబాబులకు అందిస్తున్నారు.

News December 7, 2025

ఫేక్ బ్యాంకు గ్యారంటీలు… రిలయన్స్‌పై ఛార్జిషీట్

image

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, మరో 10 కంపెనీలపై ED ఛార్జిషీట్ దాఖలు చేసింది. ₹68కోట్ల ఫేక్ బ్యాంకు గ్యారంటీలు జారీచేసి మనీల్యాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో అనిల్ అంబానీ ఇతరులు ₹17000 కోట్లమేర బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ₹1120CR ఆస్తుల్ని కూడా ED అటాచ్ చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు ₹10117 CR ఆస్తులు అటాచ్ అయ్యాయి.