News February 12, 2025

పాఠశాలల విలీనంపై మంత్రి సవిత సమీక్ష

image

పెను కొండ నియోజకవర్గ పరిధిలో పాఠశాలల విలీనంపై జిల్లా విద్యాశాఖ అధికారి క్రిష్టప్ప, ఎంఈవోలతో మంత్రి సవిత ఆర్&బి అతిథి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాధ్యమైనంతవరకు ఏ పాఠశాలనూ మూసివేయకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను సేకరించాలన్నారు. పాఠశాలలను విలీనం చేసే సమయంలో ఎలాంటి విమర్శలకూ తావివ్వకుండా అభిప్రాయాలను తీసుకోవాలన్నారు.

Similar News

News December 5, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> పాలకుర్తి: బీఆర్ఎస్‌లో చేరిన మాజీ సర్పంచ్
> పీఎండీడీకేవైలో జనగామకు స్థానం
> లింగాల గణపురం: కాంగ్రెస్ నుంచి ఇద్దరు బహిష్కరణ
> దేవరుప్పుల: భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి
> ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి: కలెక్టర్
> దేవరుప్పుల: బీఆర్ఎస్‌లో చేరికలు
> స్టే. ఘ: ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న వాహనం
> ఎన్నికల నిబంధనలు పాటించాలని కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశం

News December 5, 2025

ప్రగతి దిశలోకి తీసుకువెళ్లే కీలక వేదికగా నిలుస్తుంది: MP కావ్య

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రాన్ని కొత్త ప్రగతి దిశలోకి తీసుకెళ్లే కీలక వేదికగా నిలవనుందని వరంగల్ ఎంపీ కావ్య అన్నారు. ఢిల్లీలో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధనలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, రెండేళ్ల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు దూసుకు వెళ్తుందని అన్నారు.

News December 4, 2025

కండలేరు నుంచి నీటి విడుదల

image

కండలేరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షక ఇంజనీరు సుబ్రహ్మణ్యేశ్వర రావు తెలిపారు. జలాశయం కెపాసిటీ 60.14 టీఎంసీలు కాగా, ఎగువనుంచి 17500 క్యూసెక్కుల వర్షపు నీరు జలాశయానికి వస్తుండగా, 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జలాశయం వద్ద నీటి ప్రవాహం అదుపులో ఉందని, ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.