News August 6, 2024

పాఠశాల విద్యపై మంత్రి లోకేశ్ సమీక్ష

image

పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం రాత్రి మంత్రి అధికారులతో సమీక్షించారు. కేజీబీవీ స్కూళ్లలో పూర్తిగా ప్రతిభ ఆధారంగానే పోస్టులు వేయాలన్నారు. గురుపూజోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు.

Similar News

News September 18, 2024

‘ఛానల్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోండి’

image

గుంటూరు ఛానల్ ఆధునికరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధునికీకరణకు సంబంధించి ప్రతిపాదనలు త్వరితగతిన సిద్ధం చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

News September 18, 2024

గుంటూరులో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు

image

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, ఎన్టీఆర్ స్టేడియంలలో జరిగాయి. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ నాగలక్ష్మి , గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నసీర్, గళ్ళా మాధవి, నగరపాలక సంస్థ కమీషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు.

News September 18, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షల విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10ల‌క్ష‌ల విరాళాన్ని మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత అందజేశారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌తో కలిసి చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు.