News February 12, 2025

పాడేరులో మూతబడిన పలు హోటళ్లు

image

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో బుధవారం బంద్ విరమించినప్పటికీ పలు టీ, టిఫిన్ హోటళ్లు తెరుచుకోలేదు. రెండు రోజుల బంద్ ముందస్తు ప్రకటనతో మంగళవారం పాడేరులో వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేశారు. రెండో రోజు బంద్ కొనసాగుతుందో లేదో అనే సంశయంలో హోటళ్ల యజమానులు సిద్ధం కాలేదు. దీంతో పలు టీ పాయింట్లు, ప్రధాన హోటళ్లు బుధవారం మూతపడ్డాయి.

Similar News

News December 7, 2025

ADB: ఏడాదికోసారి ఎలక్షన్ వస్తే ఎంత బాగుంటుందో..!

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు అభ్యర్థుల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించి ‘కాస్ట్‌లీ మందు కావాలి’, ‘వారసంతకు వెళ్లాలి’, ‘ఇంట్లో సామాన్ లేదు’ అంటూ అభ్యర్థులను డబ్బుల కోసం అడుగుతున్నారు. ఇక దావతులు, పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు వస్తే ఇంట్లో దోకా ఉండదని, తమ ఖర్చులన్నీ వసూలు చేసుకోవచ్చని పలువురు బహిరంగంగా చెబుతున్నారు.

News December 7, 2025

నేడు ప.గో నుంచి ప్రత్యేక రైలు

image

ప.గో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నేటి నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రైలు నంబర్ 01781 చర్లపల్లిలో ఈ రోజు రాత్రి 9:30 గంటలకు బయలదేరి 8న రాత్రి 11:50 గంటలకు షాలిమారుకు చేరుకుంటుంది. తిరిగి చర్లపల్లికి( 01782) 10వ తేదిన సాయంత్రం 4 గంటలకు రానుంది. ఈ ట్రైన్ ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా నడుస్తుంది.

News December 7, 2025

మెదక్: ఈ ఆదివారం విందులకు సై..

image

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ప్రసన్నం చేసుకునేందుకు, మొదటి రెండు విడతల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులు నేడు పెద్ద ఎత్తున విందులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో నేడు ఆదివారం అత్యంత కీలకంగా మారింది.